సాక్షి, నల్గొండ:మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగి నీరు అనుకొని లాబోరేటరీ కెమికల్ తాగి మృతిచెందారు. వివరాల్లోకి వెళితే ఇటీవల గణేశ్ అనే 19 ఏళ్ల యువకుడికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో పట్టణంలో గల కృష్ణసాయి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. ఈ సమయంలో గణేశ్‌కు దాహం వేయడంతో నీరు అనుకొని అక్కడే ఉన్న లాబరేటరీ కెమికల్ తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


