సాక్షి హైదరాబాద్: గచ్చిబౌళి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన కూచిపూడి కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. శనివారం సాయంత్రం నాలుగు వేల మంది కళాకారులతో కూచిపూడి కళా వైభవం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రమాదేవి ఆర్ట్స్ అకాడమీ కళాకారుల బాల కూచిపూడి నృత్యకారిణి బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దానితో పాటు వేలాది మంది నర్థకిమనుల నృత్యం అందరినీ సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది.


