హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద విపల్లవం రాబోతుందన్నారు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు. జూబ్లీహిల్స్ ఎన్నికల అనేది నాలుగు లక్షల మంది భవిష్యత్తు కాదని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్ అని స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) మీట్ ద ప్రెస్‌లో హరీష్ రావు మాట్లాడారు. ‘ఈ అరాచక ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలి. ఈ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. రాష్ట్రంలో నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు చరమగీతం పాడనున్నారు. కేసిఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో విధ్వంసం. ప్రజలు వికాసం కావాలా, వికాసం కావాలా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్. సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశాడు.
ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అంటే, కాలేజీల మీద విజిలెన్స్ దాడులు, పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 9,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించింది. రెండేళ్లలో రేవంత్ రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కాలేజీలను బందు పెట్టారు. ఆ పిల్లలు జూబ్లీహిల్స్ లో కూడా ఉన్నారు. ఆరోగ్య శ్రీ వైస్సార్ తెచ్చిన పథకం అని గొప్పలు చెప్పడం కాదు.. ఆ పథకం అమలు చేయడం లేదు.
ఆసుపత్రులను బెదిరిస్తున్నారు. రూ. 1900 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వలేదు.బకాయిలు అడిగితే అధికారులు, విజిలెన్స్ దాడులు, పోలీసు దాడులు. రాష్ట్రంలో 11 పెద్ద ప్రాజెక్టులు, 13 వేల కోట్ల విలువైనవి చెరువుల్లో కడుతున్నారు, ఆపాలి అని భట్టి గారు అన్నారు. భట్టి ప్రెస్ మీట్,. సీఎం సెటిల్మెంట్. ఉద్యోగ సంఘాలపై ఏసీబీ దాడులు. దేశంలో అత్యధిక డీఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం మన తెలంగాణ. చివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. చేసింది చెప్పుకునేది లేక జూబ్లీహిల్స్ నాయకులు, ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. చివరకు ప్రజలను బెదిరిస్తున్నారు. పథకాలు ఆగిపోతాయి అని. ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకున్నది. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదు. ఓటమి భయంతో ఫ్రస్టేషన్‌లోకి పోయిండు. బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి’ అని ధ్వజమెత్తారు హరీష్‌రావు.


