సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నాయి. పెదపాడు మండలం ఏపూరి గ్రామ వైఎస్సార్‌సీపీ దళిత సర్పంచ్ చోటగిరి రామకృష్ణ పై పచ్చ మూకలదాడి చేశాయి.
ద్విచక్ర వాహనంపై నూజివీడు వెళ్లివస్తున్న రామకృష్ణను టీడీపీ మూకలు అడ్డగించి దాడి చేశాయి. బాధితుడి బైక్ నెంబర్ ప్లేట్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఫోటోలు ఉన్నాయని దాడికి దిగారు.
బైక్‌పై వెళ్తున్న రామకృష్ణను కిందకి లాగి దాడి చేశారు. ఆపై అసభ్యంగా దూషించారు. తనపై టీడీపీ నేతలు దాడి చేసి, అసభ్యంగా దూషించారని రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


