కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న రైతు బజార్ మాఫియా | Raithu Bazar Mafia Runs Rampant in Krishna District | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న రైతు బజార్ మాఫియా

Feb 10 2026 7:26 PM | Updated on Feb 10 2026 7:42 PM

Raithu Bazar Mafia Runs Rampant in Krishna District

విజయవాడ: కృష్ణా జిల్లాలో రైతు బజార్ మాఫియా రెచ్చిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేల అండతో రైతు బజార్ల మాఫియా జులుం ప్రదర్శిస్తోంది. రైతు బజార్లలో టీడీపీ నేతల వద్దే సరుకులు కొనాలని హుకుం జారీ చేసింది. ఏ షాపు పెట్టాలన్నా కూరగాయల సిండికేట్ దగ్గరే కొనాలని ఆదేశాలు ఇచ్చింది.  ఈ దందా ద్వారా నెలకు సుమారు రూ. 20లక్షలు టీడీపీ నేతల తమ ఖాతాల్లో నింపుకుంటున్నారు. 

మొత్తం దందాను టీడీపీ నేత నాగబాబు నిర్వహిస్తున్నారు. రైతులు తోటల నుంచి కాకుండా నాగబాబు నుండి తేవాలని రైతు బజార్‌ మాఫియా వార్నింగ్‌లు ఇస్తుంది. 

ఎమ్మెల్యే యార్లగడ్డకు అనుచరుడిగా ఉన్న నాగబాబు... తాను చెప్పిన వాళ్లకే షాపులు ఇవ్వాలని సిఫార్సులు చేస్తున్నారు. ఇలా గుడివాడ రైతు బజార్‌లో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. గుడివాడలో జేపీటీ వాళ్ల దగ్గరే సరుకులు కొనాలని డీల్ కుదుర్చుకున్నారు. దాంతో ఏళ్ల తరబడి ఉన్న రైతులను, వ్యాపారులను టీడీపీ నేతలు తరిమేస్తున్నారు. వేరే వాళ్ల నుండి సరుకులు తెస్తే దించేది లేదని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే రైతు బజార్‌ అధికారులు.. టీడీపీ నేతలతో కుమ్మక్కై పోయి ఈ దందా నిర్వహిస్తున్నారు.




 

Advertisement
 
Advertisement
Advertisement