‘రేపు వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి వస్తారు’ | YSRCP Leader Botsa Satyanarayana On Assembly Sessions | Sakshi
Sakshi News home page

‘రేపు వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి వస్తారు’

Feb 10 2026 7:14 PM | Updated on Feb 10 2026 8:12 PM

YSRCP Leader Botsa Satyanarayana On Assembly Sessions

తాడేపల్లి :  ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రస్టేషనలో ఉన్నారని, ఆయన ఏదోదో చేద్దామనుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు( మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన బొత్స.. రాష్ట్రంలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. 

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని. రేపు వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు. అదే సమయంలో చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బొత్స. ‘ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగాలేవు. ప్రజలు అర్ధాకలితో ఉంటే‌ పట్టించుకోవటం లేదు. రాష్ర్టంలో పాలన గాలికి వదిలేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబిఐ చెప్పింది. 

ఇక దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ ఎందుకు?, సిట్ నివేదిక ఇచ్చాక ఇంకా కమిషన్ వేయటం ఎందుకు?, అసలు ఆ కమిషన్‌కి చట్టబద్ధత ఉంటుందా?, చంద్రబాబు సిట్ నివేదికను  బయట పెట్టాలి. ఎల్లుండి శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. అన్ని విషయాలు అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని బొత్స తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement