‘కావాలంటే మీరు రేవంత్‌ఖాన్‌ అని మార్చుకోండి’ | Union Minister Kishan Reddy Takes on CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘కావాలంటే మీరు రేవంత్‌ఖాన్‌ అని మార్చుకోండి’

Feb 10 2026 5:56 PM | Updated on Feb 10 2026 6:05 PM

Union Minister Kishan Reddy Takes on CM Revanth Reddy

ఢిల్లీ :  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తాను ఎవరికీ దత్తపుత్నుడ్ని కాదనే విషయాన్ని రేవంత్‌ తెలుసుకుంటే మంచిదన్నారు. తన తల్లి పెట్టిన పేరును మార్చడానికి రేవంత్‌ ఎవరని, కావాలంటే రేవంత్‌.. రేవంత్‌ఖాన్‌ అని పేరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మజ్లిస్‌తో మీరు కాపురం చేసినన్నాళ్లూ తాము నిప్పులు పోస్తామన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏమిచ్చారో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిదా..? లేక కిషన్‌రెడ్డిదా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. ఎంపీ,ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఒక సీటు రాదని మాట్లాడారు. నా పేరు మార్చినా ఎన్ని మాట్లాడినా గెలిచేది బీజేపీనే. తల తోకా లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెండేళ్లుగా మాటలతో గడిపారు. రేవంత్ ఏం చేస్తారో చేతల్లో చూపించాలి. ఇచ్చిన మాటపై నిలబడే శక్తి లేకపోతే రాజీనామా చేయాలి. రేవంత్  చేతగానితనాన్ని బీజేపీ పై రుద్దొద్దు. రేవంత్ ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’ అని స్సష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement