‘అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌కు ఎందుకు డిమాండ్‌ చేయరు?’ | BRS Leader Harish Rao Slams Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌కు ఎందుకు డిమాండ్‌ చేయరు?’

Feb 10 2026 5:26 PM | Updated on Feb 10 2026 5:35 PM

BRS Leader Harish Rao Slams Revanth Reddy

హైదరాబాద్‌: కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్‌ అప్పనంగా తీసుకొని పోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లిహిల్స్‌ ప్యాలెస్‌లో కూర్చొని కళ్లప్పగించి చూస్తున్నాడని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. 

ఈరోజ(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తెలంగాణ భవన్‌ నుంచి మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు.. కృష్ణా జలాల 664 టీఎంసీలను , 80 శాతం ఆంధ్రప్రదేశ్ వాడుకుందని తెలంగాణ ఈఎన్‌సీ.. కేఆర్‌ఎంబీకి లేఖ రాశారని, మరి ఏపీ ప్రభుత్వం 80 శాతం నీళ్ళు వాడుకుంటే , రేవంత్ రెడ్డి , ఉత్తమ్‌లు గాడిద పళ్లు తోముతున్నారా?, 80 శాతం నీళ్ళు వాడుకుంటే, తెలంగాణ ప్రభుత్వం నిద్ర పోతుందా? అని నిలదీశారు. 

తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని , ఆ కౌన్సిల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తుందని హరీష్‌ స్పష్టం చేశారు.  రాష్ట్ర హక్కులను సీఎం రేవంత్‌రెడ్డి కాపాడాలని, ఈఎన్‌సీ పోస్టుల భర్తీపై సైతం సర్కార్‌ నిర్లక్ష్యంగా ఉందని హరీష్‌ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement