సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డిపై మనుబోలు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. మనుబోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కాకాణి.. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే కేసులు కడతారా? అంటూ మండిపడ్డారు.
కావాలనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు. మా పార్టీ నాయకులు ఫిర్యాదులు ఇస్తే పట్టించుకోవడం లేదు. కూటమినేతలు తప్పుడు ఫిర్యాదులు ఇస్తే వెంటనే అక్రమ కేసులు కడుతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు నేను బతికున్నంత కాలం అండగా నిలబడతా’’ అని కాకాణి పేర్కొన్నారు.


