బండి సంజయ్‌కు నో.. కేటీఆర్‌కు ఓకే.. | Telangana Police Not Given Permission To Bandi Sanjay Meeting | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌కు నో.. కేటీఆర్‌కు ఓకే..

Nov 7 2025 11:59 AM | Updated on Nov 7 2025 3:16 PM

Telangana Police Not Given Permission To Bandi Sanjay Meeting

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో రహమత్ నగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో రహమత్ నగర్‌లో మీటింగ్ నిర్వహించుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజ​య్‌ మీడియాతో మాట్లాడుతూ..‘మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అనుమతి ఇవ్వడం లేదని ఇప్పుడు చెప్పడమేంటి?. ఈనెల నాలుగో తేదీన అనుమతి కోసం అప్లై చేసుకుంటే ఇప్పటిదాకా నాన్చడం వెనుక మతలబు ఏంటి?. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. అందుకే బీఆర్ఎస్ సభలకు అనుమతి ఇచ్చి.. మా సభలకు ఇబ్బందులు కలిగించడమేంటి?. బీజేపీ సభలకు అనుమతి ఇస్తే.. ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్ నేతలకు పట్టుకుంది. జూబ్లీహిల్స్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. కర్రు కాల్చి వాత పెట్టడం తథ్యం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

మరోవైపు.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తాజాగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పది వేల ఓట్లు తెచ్చుకుంటే బీజేపీ గొప్ప. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒకరికి ఒకరు సహాకరించుకుంటుంన్నారు. కుండ మార్పిడి లాగా ఓట్ల మార్పిడి చేసుకుంటున్నారు. గతంలో కిషన్‌ రెడ్డి గెలుపునకు బీఆర్‌ఎస్‌ సహకరించింది కాబట్టే.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కోసం బీజేపీ అభ్యర్థిని బలి చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.   గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వెళ్తాం. బీజేపీ మతతత్వ పార్టీ.. విభజించి ఓట్లు అడుగుతారు అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement