Live Updates
జూబ్లీహిల్స్ కౌంటింగ్: తొలి రౌండ్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం
- మొదటి రౌండ్ ఫలితాలు..
- కాంగ్రెస్- 8926
- బీఆర్‌ఎస్- 8864
- మొదటి రౌండ్‌లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ
2025-11-14 08:59:26
పోస్టల్ బ్యాలెట్లు ఇలా..
- కొనసాగుతున్న కౌంటింగ్..
- పోస్టల్ బ్యాలెట్లు ఇలా..
- కాంగ్రెస్-39
- బీఆర్‌ఎస్-36
- బీజేపీ-10
2025-11-14 08:51:32
గెలుపు మాదే: మంత్రి వాకిటి శ్రీహరి
- సాక్షి టీవీతో మంత్రి వాకిటి శ్రీహరి..
- జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ ఓటు చేశారు
- మూడు పర్యాయాలు బీఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కానీ జూబ్లీహిల్స్ అభివృద్ధి కాలేదు
- అధికారం కోల్పోయి సిట్టింగ్ స్థానాలు కోల్పోయామని అడ్డగోలుగా బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు మాట్లాడుతున్నారు
- బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్టు మేము కూడా చేస్తామనుకుంటున్నారు
- కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగాం
- జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది.
- పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినట్లు మద్యం డబ్బులు పంచినట్లు మేము పంచలేదు.
- ప్రజలకు చిన్నచిన్న కోరికలు ఉన్నాయి.
- పదేళ్లు ఆ కోరికలను కూడా తీర్చలేదు.
- జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం
2025-11-14 08:51:32
- తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం ఉంది.
- కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు.
2025-11-14 08:47:46
ఇండిపెండెంట్ల వాకౌట్..
- ఇండిపెండెంట్ల వాకౌట్..
- కౌంటింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత..
- కౌంటింగ్ హాల్‌లో అభ్యర్ధుల ఏజెంట్ల కోసం సీటింగ్ లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్న ఇండిపెండెంట్ ఏజెంట్లు
2025-11-14 08:29:00
ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం
- పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం
- ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
- ముందుగా షేక్ పేట్ డివిజన్ ఈవీఎంలు ఓపెన్ చేసిన అధికారులు
- రెండు రౌండ్లో పూర్తి కానున్న షేక్ పేట్ డివిజన్ కౌంటింగ్.
2025-11-14 08:23:03
కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యత
- కొనసాగుతున్న కౌంటింగ్
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యత.
2025-11-14 08:14:49
కౌంటింగ్ ప్రారంభం.
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం.
- ముందుంగా పోస్టుల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.
- పేపర్ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తున్న సిబ్బంది.
- హోమ్ ఓటింగ్ ద్వారా వేసిన 101 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- హోమ్ ఓటింగ్ ద్వారా 101 ఓట్లు వేసిన వృద్ధులు, వికలాంగులు
2025-11-14 08:01:33
కౌంటింగ్ కేంద్రానికి నవీన్ యాదవ్..
- కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్..
- బల్కంపేట ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నవీన్ యాదవ్.
- నవీన్ యాదవ్ కామెంట్స్..
- మంచి మెజారిటీతో గెలుస్తా..
- బీఆర్ఎస్ నుంచి మాజీలు వస్తే.. మా పార్టీ నుంచి సిట్టింగ్ వాళ్లు వచ్చారు..
- జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి వైపే చూశారు.
2025-11-14 07:53:46
కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం..
- నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు..
- కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం..
- మొదట లెక్కించనున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..
- 109 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు చేసుకోగా.. పోలనవి 103 ఓట్లు..
- పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ప్రారంభం కానున్న ఈవీఎంల లెక్కింపు..
- కౌంటింగ్ హల్‌కి చేరుకొని లెక్కింపునకు సిద్ధంగా ఉన్న సిబ్బంది..
- లెక్కింపు ప్రాంతానికి చేరుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు..
- జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్, ఉప ఎన్నిక ఆర్ఓ సాయిరాం పర్యవేక్షణలో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ..
2025-11-14 07:53:46
కౌంటింగ్ సెంటర్‌కు అభ్యర్థులు
- కోట్ల విజయభాస్కర్ స్టేడియానికి మాగంటి సునీత, నవీన్ యాదవ్, లంకల దీపక్, ఇతర అభ్యర్థులు
- అంతకు ముందు అభ్యర్థులు ప్రత్యేక పూజలు
- బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నవీన్ యాదవ్ పూజలు
- మాదాపూర్ సుబ్రహ్మణ్య ఆలయంలో మాగంటి సునీత పూజలు
- మరికాసేపట్లో ప్రారంభం కానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్
2025-11-14 07:48:22
రౌండ్ డివిజన్లు పోలింగ్ బూత్ నెంబర్లు
- రౌండ్ డివిజన్లు పోలింగ్ బూత్ నెంబర్లు
- 1. షేక్‌పేట- 1-42
- 2. షేక్‌పేట, ఎర్రగడ్డ- 43-85
- 3. రహమత్ నగర్, వెంగళ రావునగర్- 86-128
- 4. వెంగళరావునగర్, రహ్మత్నగర్- 129-171
- 5. రహ్మత్న గర్, వెంగళరావునగర్- 172-214
- 6. వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ-215-257
- 7.యూసుఫ్‌గూడ, సోమాజిగూడ-258-300
- 8. సోమాజిగూడ , ఎర్రగడ్డ, బోరబండ-301-343
- 9. బోరబండ, ఎర్రగడ్డ- 344-386
- 10.ఎర్రగడ్డ- 387-407
2025-11-14 07:23:54
పోలింగ్ శాతం ఇలా..
- జూబ్లీహిల్స్ మొత్తం పోలింగ్- 48.49%
- మొత్తం పోలైన ఓట్లు-1,94,631
- డివిజన్ వారీగా పోలింగ్ శాతం, పోలైన ఓట్లు
- బోరబండ-55.92% పోలింగ్ | 29,760 ఓట్లు
- రహ్మత్‌నగర్-54.59% పోలింగ్ | 40,610 ఓట్లు
- ఎర్రగడ్డ-49.55% పోలింగ్ | 29,112 ఓట్లు
- వెంగల్‌రావు నగర్-47.00% పోలింగ్ | 25,195 ఓట్లు
- షేక్‌పేట్-43.87% పోలింగ్ | 31,182 ఓట్లు
- యూసుఫ్‌గూడ-43.47% పోలింగ్ | 24,219 ఓట్లు
- సోమజిగూడ (శ్రీనగర్ కాలనీ)-41.99% పోలింగ్ | 14,553 ఓట్లు
2025-11-14 07:05:26
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ..
- జోరుగా సాగుతున్న బెట్టింగ్స్..
- కౌంటింగ్ కేంద్రం చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు...
- కేంద్ర బలగాలు (పారామిలిటరీ), రాష్ట్ర సాయుధ పోలీసులు మరియు స్థానిక పోలీసులు పహారా..
- స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు భద్రత...
- ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ...
- కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో గుమిగూడటం పూర్తిగా నిషేధం..
- రోడ్లపై బాణసంచా కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధం..
- కౌంటింగ్ హాల్ లోకి సిబ్బంది, ఏజెంట్స్, ఉన్నత అధికారులు మాత్రమే ఎంట్రీ..
- ఆంక్షలు, భద్రతతో ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించడానికి చర్యలు..
2025-11-14 06:57:10
నేడు జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ఫలితాలు..
- నేడు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు..
- కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కౌంటింగ్ హాల్ వద్ద గట్టి భద్రత ఏర్పాటు..
- కౌంటింగ్ హాల్ చుట్టూ పోలీస్ ఆంక్షలు..
- భద్రత కోసం ప్రత్యేక లైన్‌లు ఏర్పాటు..
- ఒక్కో టేబుల్ కు ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు..
- 42 టేబుల్స్‌కు అమర్చిన సీసీ కెమెరాలు..
- కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు..
2025-11-14 06:57:10
Advertisement


