‘జూబ్లీహిల్స్‌’పై నేడు కేసీఆర్‌ దిశానిర్దేశం | KCR to give directions to party on october 23 over jubilee hills by election | Sakshi
Sakshi News home page

‘జూబ్లీహిల్స్‌’పై నేడు కేసీఆర్‌ దిశానిర్దేశం

Oct 23 2025 6:19 AM | Updated on Oct 23 2025 6:19 AM

KCR to give directions to party on october 23 over jubilee hills by election

ఎర్రవల్లి నివాసానికి వెళ్లనున్న ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌లు, స్టార్‌ క్యాంపెయినర్లు

ప్రచార ఎజెండాతోపాటు సమావేశాలు, ర్యాలీల నిర్వహణపై సూచనలు

కేసీఆర్‌తో సమావేశమైన కేటీఆర్, హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారపర్వంపై దృష్టి కేంద్రీక రించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితోపాటు పార్టీ డివిజన్‌ ఇన్‌ చార్జ్‌లు, స్టార్‌ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. గురువారం జరిగే భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండాపై కేసీఆర్‌ దిశానిర్దే శం చేస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, ఓటరు మనోగతం తదితరాలపై చర్చించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కసరత్తు జరిగినట్టు తెలిసింది.

బహిరంగ సభకు విముఖత: ఇప్పటికే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ బీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది. ప్రచారానికి కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో విస్తృత ప్రచారానికి అవలంబించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. నగరంలో ఉండే ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ సభలు, సమావేశాల జోలికి వెళ్లకుండా డివిజన్ల వారీగా హాల్‌ మీటింగ్స్, కార్నర్‌ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్లకు చేరువయ్యేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్టీ బృందాలు ప్రతీ ఇంటిని సందర్శించేలా షెడ్యూల్‌ రూపొందించాలని కేసీఆర్‌ ఆదేశించారు. ప్రచారం చివరిదశలో జరిగే రోడ్‌ షోలో కేసీఆర్‌ పాల్గొనే అవకాశమున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement