
నామినేషన్ దాఖలు చేస్తున్న బీఆర్‌ఎస్ నేత పి.విష్ణువర్ధన్‌రెడ్డి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ నేత, పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే, సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న కూడా మాగంటి సునీత మరోసారి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల స్క్రూటినీలో ఏదైనా తేడా వస్తే విష్ణు బరిలో ఉంటారని తెలుస్తోంది.