
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills By poll) ప్రచారం, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నట్టు సమాచారం. తాజా భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) బుధవారం ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే, తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇక, రేపు(గురువారం) కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
