జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కోఆర్డినేషన్ కమిటీని వేసిన కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు కమిటీని వేసిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
మొత్తం 16 మందితో కమిటీ వేసిన టిపిసిసి. ఈ కమిటీలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు సిటీ కాంగ్రెస్ నేతలకు చోటు దక్కింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ కమిటీ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికను గెలవాలనే సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.


