తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ముగిసింది | Congress Reacts On KCR SIT Inquiry | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ముగిసింది

Feb 1 2026 4:04 PM | Updated on Feb 1 2026 4:12 PM

Congress Reacts On KCR SIT Inquiry

సాక్షి, హైదరాబాద్‌: హత్యానేరం కన్నా.. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ మహా పాపమని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఒకవైపు ఆదివారం నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ సిట్‌ విచారణ కొనసాగుతున్న వేళ..  మరోవైపు సీఎల్పీ మీడియా హాల్‌లో పలువురు నేతలు ఈ అంశంపై మీడియా మాట్లాడారు. 

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఏ తప్పు చేయకపోతే విచారణ వేళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు హడావుడి చేస్తోంది?. చెప్పు కావడానికి సిగ్గుచేటు ఫోన్ ట్యాపింగ్. విచారణకు హాజరుకావడానికి వేల కార్ల కాన్వాయ్‌లు ఎందుకు?. ట్యాపింగ్ భాగోతం అందరికీ తెలియజేయడానికి ర్యాలీలు చేస్తున్నారా?. ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కేసీఆర్‌కి తెలియకుండా తెచ్చారా?. ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు..

గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు విచారణకు హాజరయ్యారు. మీరు నిజాయితీ పరులైతే ఒక్కరే వచ్చి విచారణకు హాజరైతే బాగుండేది. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్‌ కూతురు కవితనే చెబుతోంది. ట్యాపింగ్ కేసు లో ఉన్న ప్రభాకర్ రావు ఎందుకు అమెరికా పారిపోయాడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆఫీస్ నుంచి హార్డ్ డిస్కులు ఎందుకు మాయం అయ్యాయి?. మూసి నదిలో,వికారాబాద్ అడవుల్లో ఎందుకు డిస్కులు దొరికాయి. సిగ్గు లేకుండా భార్యాభర్తల ఫోన్ లు ట్యాప్ చేశారు

అన్ని ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టినా బీఆర్‌ఎస్‌లో మార్పు రాలేదు. తెలంగాణ లో ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నారు. ప్రజా పాలనలో అంబేద్కర్ రాజ్యంగం అమలు అవుతుంది. కేసీఆర్ రాజ్యాంగం ముగిసి చాలారోజులైంది. 

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిజాయితీగా ఉద్యమం చేయలేదు. రాజకీయం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారు. విచారణ ఎదుర్కొంటున్న  రూంలో కూర్చుని కేసీఆర్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రూంలో కూర్చుని బజ్జీలు తిని ముచ్చట్లు పెట్టి వచ్చేవాళ్ళం. కేసీఆర్ ఆ రూంలో కూర్చొని ఏం చేస్తే తనకి బెనిఫిట్ అవుతుందా? అని ఆలోచించేవారు. సకల జనుల సమ్మె, సాగర హారం లాంటి అనేక కీలక ఘట్టాల్లో కేసీఆర్ బయటకి రాలేదు. తెలంగాణ కోసం కేసీఆర్ నటించాడు. అసలు తెలంగాణ బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ పార్లమెంట్‌లోనే లేడు. 
దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని తేలిపోయింది. కూలీ బ్యాచ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తే భయపడుతామా?. 

కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. ఇజ్రాయిల్ నుండి ఎక్విప్మెంట్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. బీఆర్ఎస్ ఓడిపోగానే హార్డ్ డిస్కులు ఎందుకు నాశనం చేసి పడేసారు?. తప్పు చేసినవాళ్లు చంద్రమండలానికి పారిపోయిన లాక్కొని వస్తాం. రాజ్యాంగంపై నమ్మకముంటే కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలి. కేసీఆర్ కథలు వెబ్ సిరీస్ తీయవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తెలంగాణలో లేకుండా చేస్తారు అని అద్దంకి దయాకర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement