
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ భగ్గుమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతుంది? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి నియోజకవర్గంలో వేలుపెట్టడం మీకు అలవాటు. నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. మీరు కూడా ఏదో ఒకరోజు బయటకు వెళ్లడం పక్కా’’ అంటూ రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కాగా, అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై పడింది. రాష్ట్ర రాజధానిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ఉపఎన్నిక ఆసక్తిగా మారింది. ఎన్నికల బరికి ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు చిన్నా చితక పార్టీలు, సామాజిక వేత్తలు, నిరసనకారులు పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిరసన గళం తలనొప్పిగా తయారైంది. కుల, నిరుద్యోగ సంఘాలతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్ల వేసేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత రెండో ఉపఎన్నిక కావడంతో జూబ్లీహిల్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసుకొని ముందస్తుగానే ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్లు చైర్మన్లను రంగంలోకి దింపారు. గత రెండు మాసాల్లో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసి బీసీ కార్డు ప్రయోగించి యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను ఎన్నికల బరిలో దింపింది. టికెట్ ఆశించిన సీనియర్లు అసంతృప్తికి గురి కావడంతో మంత్రులను రంగంలోకి దింపి బుజ్జగించడంలో సఫలీకృతమైంది. తాజాగా నిరసనగళం ఆందోళన కలిగిస్తోంది.