
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్‌లో కొట్టబోతుందన్న కేటీఆర్.. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడతాం. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగస్థితిలో ఉన్నాడు. దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘రెండేళ్ల తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ సీఎం కాబోతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం’’ అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు.