సాక్షి, హైదరాబాద్: టీసీయూఆర్ విస్తరణపై అధికారిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) విస్తరణను ప్రభుత్వం పూర్తి చేసింది. 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. విలీన ప్రక్రియ మార్పులు ఇవ్వాల్టి నుంచి అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955లో వచ్చిన తాజా ఆర్డినెన్స్‌ల ఆధారంగా విస్తరణకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుండి మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ జీహెచ్‌ఎంసీ పరిధిలో భాగం కానుంది. ప్రాంత విస్తరణపై ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
జీహెచ్‌ఎంసీలో కలిసిన 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జోన్లు కేటాయింపు ఇలా..
చార్మినార్ జోన్:
1. ఆదిభట్ల
2. బడంగ్ పేట్
3. జల్ పల్లి
4. శంషాబాద్
5. తుర్కయాంజాల్.
శేరిలింగంపల్లి జోన్:
1. బండ్లగూడ జాగీర్
2. మణికొండ
3. నార్సింగి
4. అమీన్ పూర్
5. తెల్లాపూర్
ఎల్ బీ నగర్ జోన్:
1. మీర్ పేట్
2. పెద్ద అంబర్ పేట
3. తుక్కుగూడ
4. దమ్మాయిగూడ
5. ఘట్ కేసర్
6. పీర్జాదిగూడ
7. పోచారం
సికింద్రాబాద్ జోన్
1. బోడుప్పల్
2. జవహర్ నగర్
3. నాగారం
4. తూంకుంట
కూకట్ పల్లి జోన్:
1. దుండిగల్
2. గుండ్లపోచంపల్లి
3. కొంపల్లి
4. మేడ్చల్
5. నిజాంపేట్
6. బొల్లారం.


