సాక్షి కొత్తగుడెం: భద్రాద్రి జిల్లా కొత్తగుడెంలో బాంబు పేలడం సృష్టించింది. స్థానిక రైల్వేస్టేషన్ లో పట్టాలపై పడి ఉన్న సంచిని కుక్క కొరికింది. అందులో పేలుడు పదార్థాలు ఉండడంతో పేలుడు సంభవించింది. దీంతో కుక్కకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. బాంబు పేలుడుకు పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో అక్కడే ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. ఆసంచిలోకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


