ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంటకు చెందిన జాదవ్ కిషన్, దేవ్‌కబాయి దంపతులకు ప్రతాప్‌సింగ్, కుబేర్‌సింగ్, అనార్‌సింగ్, రామ్‌లఖన్‌సింగ్ నలుగురు కు మారులు సంతానం. గతంలో జాదవ్ కిషన్ ఒకసారి సర్పంచ్‌గా, ముత్నూర్ ఎంపీటీసీగా, తల్లి ఏమాయికుంట సర్పంచ్‌గా సేవలందించారు. తండ్రి మరణానంతరం నాలుగో కుమారుడు లఖ న్‌సింగ్ గత ఎన్నికల్లో ఏమాయికుంట సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందాడు.
ప్రస్తుత ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో నామినేషన్ దాఖలు చేశాడు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న సోదరులు జాదవ్ కుబేర్‌సింగ్, అనార్‌సింగ్ సర్పంచ్ పదవికి పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఓటర్లు అయోమయస్థితిలో పడిపోయారు. అదేవిధంగా మండలంలోని హీరాపూర్ గ్రామపంచాయతీలో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. ముగ్గురు అన్నదమ్ములు, అత్తా కోడళ్లలో ఎవరు గెలుస్తారోనని మండల ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.


