హస్తవాసి పెరిగేనా.. కారు పరుగెత్తేనా.. కమలం వికసించేనా?
జూబ్లీహిల్స్‌లో ఆ మూడు పార్టీలకూ గెలుపు ప్రతిష్టాత్మకం
సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ
ప్రభావం చూపనున్న బలాలు.. బలహీనతలు
విజయం తమదేనన్న ధీమాలో ప్రధాన పక్షాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ‘జూబ్లీహిల్స్’ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పక్షాలకు అగ్ని పరీక్షగా మారింది. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు గెలుపు కోసం అవసరమయ్యే అన్ని అ్రస్తాలను ప్రయోగిస్తూ సర్వశక్తులొడ్డుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, బీసీ కార్డు, సినీ కార్మికుల సంక్షేమం, మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం వంటివి కాగా.. బీఆర్‌ఎస్ సానుభూతి, మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం, ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు, ప్రత్యర్థుల కుటుంబ నేపథ్యం తమకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తోంది. బీజేపీ హిందూత్వ ఎజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మల్చుకుంటోంది. మూడు పక్షాలూ హేమాహేమీలను ఎన్నికల ప్రచారంలో దింపడంతో మాటల తూటాలు రాజకీయ అగ్గి రాజేస్తున్నాయి. ఆయా పారీ్టల గెలుపోటములపై బలాలతో పాటు బలహీనతలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్‌కు అనుకూల అంశాలు
రాష్ట్రంలో అధికారంలో ఉండటం, కేవలం రెండు నెలల్లో రూ.150 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్‌కు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం, పార్టీ అభ్యరిత్వం ఎంపికలో బీసీ కార్డు ప్రయోగం. ఎన్నికల బరిలో దిగిన యువనేత నవీన్ యాదవ్‌కు వ్యక్తిగత పరిచయాలు, మజ్లిస్, వాపపక్షాలు, టీజేసీ, సినీ కారి్మకులు, బీసీ సంఘాల మద్దతు, సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఫోకస్ పెట్టడం. గత 12 ఏళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాలు.
ప్రతికూల అంశాలు: నియోజకవర్గంలో సంస్థాగత పట్టుతో పాటు స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం, పార్టీలలోని కొత్త, పాత కేడర్‌లో అంతర్గత కుమ్ములాటలు, కొరవడిన సమన్వయం, నవీన్ యాదవ్ కుటుంబ నేపథ్యం, దివంగత మాగంటి గోపీనాథ్ మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం వహించడం. బీఆర్‌ఎస్‌కు గట్టి కేడర్, గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థుల ప్రచారం తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయి.
బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశాలు..
సానుభూతి గత మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం, సంస్థాగతంగా గట్టి ఓటు బ్యాంక్, స్థానిక ప్రాతినిధ్యం, ముస్లిం మైనారిటీల్లో పట్టున్న సోషల్ వర్కర్ పారీ్టలో చేరడం, ఎన్నికల ప్రచార భారాన్ని మొత్తాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకోవడం, గత రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు.
ప్రతికూల అంశాలు: అధికారంలో లేకపోవడం, పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించడం, అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షమైన మజ్లిస్ కాంగ్రెస్ పంచన చేరడం. తాజాగా అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, ప్రత్యర్థి యువకుడు కావడంతో పాటు వ్యక్తిగత పరిచయాలు అధికంగా ఉండటం.
కమలం పార్టీకి అనుకూల అంశాలు
హిందూత్వ ఎజెండా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్మిషా. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాజీ మజ్లిస్ నేత కావడం, మజ్లిస్ బేషరతుగా మద్దతు ఇవ్వడం, టీడీపీ, జనసేన పారీ్టల మద్దతు. అభ్యర్థి దీపక్ రెడ్డికి విరివిగా వ్యక్తిగత పరిచయాలు ఉండటం
ప్రతికూల అంశాలు: సంస్థాగతంగా బలహీనంగా ఉండటం. స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం. బీజేపీ పోటీ చేయడం రెండోసారి కావడం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14% ఓట్లు లభించడం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లతో పోలిస్తే పారీ్టకి బలమైన కేడర్ నెట్‌వర్క్ లేకపోవడం.


