హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా? అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనపై రాష్ట్రంలోని మా రెండేళ్ల పాలనై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరాఉ. రాష్ట్ర అభివృద్ధికి కిషన్‌రెడ్డి మోకాలు అడ్డుతున్నారని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణలను కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని మహేష్‌గౌడ్ మండిపడ్డారు. తాము ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలను నెరవేర్చామన్నారు మహేష్‌గౌడ్.
కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమే..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్, హరీష్ చేసిన తప్పిదాల వల్లే నదీజాలల సమస్యలు వచ్చాయన్నారు. వృథా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ అనవరసరప ఖర్చు చేశాడని, తామ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటన్నామన్నారు. అప్పులపై కేసీఆర్ ఏం సంజాయిషీ ఇస్తారో చూద్దామన్నారు. ప్రతిపక్షాలు ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 70 శాతం సీట్లు గెలిచామని, మరి బీఆర్‌ఎస్ ఎక్కడుంది?అని ప్రశ్నించారు మహేష్ గౌడ్.


