కూలిన రాతి గని.. శిథిలాల కింద 15 మంది కార్మికులు | Stone Mine Collapses In Up Sonbhadra | Sakshi
Sakshi News home page

కూలిన రాతి గని.. శిథిలాల కింద 15 మంది కార్మికులు

Nov 16 2025 9:35 AM | Updated on Nov 16 2025 10:26 AM

Stone Mine Collapses In Up Sonbhadra

సోనభద్ర: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోన్‌ భద్రలో గని కూలిపోయింది. శిథిలాల కింద 15 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఒక మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికీ తీశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోనభద్రలోని ఒబ్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఆ ఘటన జరిగింది.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ పాటు రెండు ప్రైవేట్ కంపెనీల రక్షణ బృందాలు, ఒబ్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ బృందం రక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బద్రినాథ్ సింగ్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదనపు పరికరాలు, యంత్రాలతో సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ప్రమాద సమయంలో తొమ్మిది కంప్రెసర్లు పనిచేస్తుండగా, ప్రతి కంప్రెసర్ వద్ద ఒక్కొక్కరు విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement