ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టే కాలానికి రోజులు చెల్లాయని 1967 శ్రీకాకుళం సాయుధ పోరాటం నేతలు అన్నారు.
శ్రీకాకుళం: ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టే కాలానికి రోజులు చెల్లాయని 1967 శ్రీకాకుళం సాయుధ పోరాట నేతలు పేర్కొన్నారు. గిరిజన రైతాంగ సాయుధ పోరాటానికి మళ్లీ ఊపిరి పోస్తామని...యువతను పోరాటాల వైపు మళ్లిస్తామని నేతలు వ్యాఖ్యానించారు.
భూమి సాగు పట్ల రైతుల అభిప్రాయం మారడం వల్లే తుళ్లూరులో భూపోరాటం నీరు గారిందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టే రోజులు పోయాయని... ఇక ప్రజలు సహనం వహించే పరిస్థితి లేదని దీనిని ప్రభుత్వాలు కనువిప్పు చేసుకోవాలని 1967 శ్రీకాకుళం సాయుధ పోరాట నేతలు సూచించారు.