లోన్ యాప్ వేధింపులకు యువకుడు ఆత్మహత్య | Man Lost Life for Instant Loan Apps Harassment | Sakshi
Sakshi News home page

లోన్ యాప్ వేధింపులకు యువకుడు ఆత్మహత్య

Feb 4 2026 12:07 PM | Updated on Feb 4 2026 12:18 PM

Man Lost Life for Instant Loan Apps Harassment

హైదరాబాద్‌: లోన్ యాప్‌ల వేధింపులు మరో కుటుంబాన్ని విషాదంలోకి నెట్టాంది. ముషిరాబాద్‌ రాంనగర్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ కొంతకాలం క్రితం లోన్ యాప్ ద్వారా రూ. 3,000 రుణం తీసుకున్నాడు. అయితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో యాప్‌కు చెందిన రికవరీ ఏజెంట్లు అతన్ని తీవ్రంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తరచూ ఫోన్ కాల్స్, బెదిరింపులు, మానసిక ఒత్తిడి పెంచడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమ్ కుమార్ చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. 

బాధితుడి భార్య నాగవేణి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement