కడియం అనర్హతపై నేడు విచారణ | Hearing on Kadiyam Srihari disqualification set on February 04 | Sakshi
Sakshi News home page

కడియం అనర్హతపై నేడు విచారణ

Feb 4 2026 6:12 AM | Updated on Feb 4 2026 6:12 AM

Hearing on Kadiyam Srihari disqualification set on February 04

స్పీకర్‌ చాంబర్‌లో పిటిషనర్‌ వాంగ్మూలం నమోదు

సాక్షి, హైదరాబాద్‌: స్టేష న్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడి యం శ్రీహరిపై బీ ఆర్‌ఎస్‌ దాఖలు చేసిన అనర్హత పి టిషన్‌పై శాస నసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ బుధవారం విచారణ జరపనుంది. స్పీకర్‌ చాంబర్‌లో ఉదయం 11 గంటలకు జరిగే విచారణలో భాగంగా పిటిషనర్‌గా ఉన్న బీఆర్‌ఎస్‌ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు.

కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఏవైనా ఆ ధారాలు ఉంటే సమర్పించాలని స్పీకర్‌ ఆదేశించారు. విచారణకు సంబంధించిన షెడ్యూలు కాపీని వివేక్, కడియం శ్రీహరికి పంపుతూ అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి మంగళవా రం పంపించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై ఈ నెల 18న స్పీకర్‌ విచారణ చేపట్టనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement