Hyundai Venue N Line: వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Hyundai Venue N Line 2022launched Check price mileage features - Sakshi

సాక్షి, ముంబై: కొరియన్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కొత్త కార్‌ను భారత మార్కెట్లో నేడు (సెప్టెంబరు 6, 2022) లాంచ్‌ చేసింది. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ తర్వాత,  స్పోర్టీ అవతార్‌లో హ్యుందాయ్‌ వెన్యూ ఎన్ లైన్‌  విడుదల చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ  మార్కెట్‌లో అందుబాటులో ఉండగా, ఈ స్పోర్టీ ఎస్‌యూవీకి సంబంధించి ఇండియాలో  రూ. 21వేలతో బుకింగ్‌లను  కూడా ప్రారంభించింది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఇంజీన్‌,ఫీచర్లు
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 1.0 కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.  2వ జెన్ 7-స్పీడ్ డిసిటితో వస్తున్న ఈ ఇంజీన్‌  పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 88.3 kw (120 PS), 172 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

డ్యూయల్ కెమెరాతో ప్రత్యేకమైన డాష్‌క్యామ్‌ అందిస్తోంది. 60కి పైగా హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కారు ఫీచర్లున్నాయి.  అలెక్సా , గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌తో హోమ్ టు కార్ (H2C)ని కూడా కలిగి ఉంటుంది. అలాగే కస్టమర్‌లకు సాధారణ, ఎకో, స్పోర్ట్ మోడ్‌ల మధ్య ఎంచుకోవడానికి వీలు కల్పించే డ్రైవ్ మోడ్ ఎంపికను కూడా  ఆఫర్‌ చేస్తోంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 30కి పైగా భద్రతా ఫీచర్లు , 20కిపైగా  స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC),  4 డిస్క్ బ్రేక్‌లు, ISOFIX, EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, పార్కింగ్ అసిస్ట్ లాంటి హ్యుందాయ్ వెన్యూ ఎన్‌ లైన్‌లోని ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 

హ్యుందాయ్ వెన్యూ ఎన్ ధరలు
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఎన్‌6, ఎన్‌8 అనే అనే రెండు వేరియంట్‌లలో లభ్యం.  ఎన్ 6 వేరియంట్ ధర రూ. 12.16 లక్షలు కాగా, ఎన్8 వేరియంట్ ధర రూ. 13.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top