హ్యుందాయ్ ఇండియా.. ఇటీవల ప్రవేశపెట్టిన వెన్యూ లైనప్‌ను విస్తరిస్తూ.. కొత్త HX5+ ట్రిమ్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది సాధారణ వెన్యూ కంటే కొన్ని ఎక్కువ ఫీచర్స్ పొందినట్లు తెలుస్తోంది.
వెన్యూ HX5+ కారులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. స్టాండర్డ్ HX5 వేరియంట్‌తో పోలిస్తే.. కొత్త వేరియంట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, రూఫ్ రెయిల్స్, రియర్ విండో సన్‌షేడ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, స్టోరేజ్‌తో డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ వైపర్ & వాషర్ పొందుతుంది.
వెన్యూ HX5+ కారు సాండ్, మడ్, స్నో మోడ్స్ పొందుతుంది. ఇందులో ఇప్పుడు డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు ఫీచర్ కూడా ఉంది.
ఇదీ చదవండి: ఒక్క కంపెనీ.. 22.55 లక్షల కార్లు!


