లెక్సస్‌ కారు @ రూ.2.39 కోట్లు

Lexus LC500h launched at Rs 2. 39 crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జపాన్‌ సంస్థ లెక్సస్‌.. తాజాగా భారత్‌లో కొత్త ఎల్‌సీ 500హెచ్‌ మోడల్‌ను పరిచయం చేసింది. నాలుగు సీట్లు ఉన్న ఈ లగ్జరీ కూపే ధర రూ.2.39 కోట్లు. గ్లాస్‌ బ్లాక్‌ మెటాలిక్‌ ఫినిష్, 3డీ మెషీన్డ్‌ టెక్స్చర్‌తో అలాయ్‌ వీల్స్, 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, 3.5 లీటర్, 6 సిలిండర్, మల్టీ స్టేజ్‌ హైబ్రిడ్, లీటరుకు 12.3 కిలోమీటర్ల మైలేజీ, 264 కిలోవాట్‌ పవర్‌ ఏర్పాటు ఉంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు.

ఇదీ చదవండి: ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్‌ దిగ్గజాలకు మస్క్‌ సంచలన సలహా

గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకన్లలోనే చేరుకుంటుంది. పనోరమిక్‌ వ్యూ మానిటర్, రేర్‌ క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్, 10 ఎయిర్‌బ్యాగ్స్, కార్బన్‌ ఫైబర్‌ రీ–ఇన్‌ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్స్‌ రూఫ్, డైనమిక్‌ హ్యాండ్లింగ్‌ సిస్టమ్, వేరియేబుల్‌ గేర్‌ రేషియో స్టీరింగ్, డ్రైవ్‌ స్టార్ట్‌ కంట్రోల్, వెహికిల్‌ డైనమిక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్, ఈబీడీతో ఏబీఎస్, బ్రేక్‌ అసిస్ట్‌ సిస్టమ్, ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్, వెహికిల్‌ స్టెబిలిటీ కంట్రోల్, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. భారత్‌లో హైదరాబాద్‌ సహా ఏడు నగరాల్లో లెక్సస్‌ షోరూంలు ఉన్నాయి. (వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్‌ వీడియో)

 లగ్జరీ  కార్లు, స్మార్ట్‌ఫోన్లు,  ఈవీల పై  తాజా సమాచారం కోసం చదవండి: సాక్షి బిజినెస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top