వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్‌ వీడియో 

Uttarakhand snake came out ATM Shocking video - Sakshi

అసలే  పెద్ద నోటు రూ. 2000 రద్దుతో ఇబ్బందులు పడుతున్న వారికి మరో షాకింగ్‌ న్యూస్‌. ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావటం కలకలం  రేపింది. ​ తాజాగా  వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ వీడియో  ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 

ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని రామ్‌నగర్‌ కోసీ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఏంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం (మే24,2023) ఏటీఎంకు మనీ విత్‌డ్రా కోసం  వెళ్లాడు ఒక వ్యక్తం. విత్‌ డ్రాయల్‌ ప్రాసెస్  పూర్తియ్యాక డబ్బులు ఎదురు చూస్తుండగా ఒక పాముపిల్ల బయటకు  వచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డు ద్వారా సంబంధిత అధికారులు సమాచారం అందించారు.  

దీంతోపాటు సేవ్ ది స్నేక్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్‌ కశ్యప్‌ కూడా సమాచారం అందించాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంకు అధికారులు.. ఏటీఎంను తెరిచారు. ఈ క్రమంలో ఏటీఎం మెషీన్‌లో ఏకంగా పది పాము పిల్లల్ని గుర్తించారు చంద్రసేన్. అంతేకాదు అవి  విషపూరిత పాములని కూడా తెలిపారు. వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.  ఏటీఎంను తాత్కాలింగా మూసివేసినట్టు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top