2023 Bajaj Pulsar NS200 And NS160 Launched: Check Price Details And Features Inside - Sakshi
Sakshi News home page

సరికొత్త ఫీచర్లతో బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ సిరీస్‌  

Mar 18 2023 3:54 PM | Updated on Mar 18 2023 6:01 PM

2023 Bajaj Pulsar NS200 and NS160 launched check new features - Sakshi

హైదరాబాద్‌: బజాజ్‌ ఆటో తన పల్సర్‌ ఎన్‌ఎస్‌ నేకెడ్‌ స్ట్రీట్‌ఫైటర్‌ లైన్‌కు అప్‌డేట్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని ఎన్‌ఎస్‌ 160, ఎన్‌ఎస్‌ 200 మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1.35 లక్షలు.., రూ.1.47 లక్షలుగా ఉన్నాయి.

మంచి హ్యాండ్లింగ్‌ కోసం యూఎస్‌డీ ఫ్రంట్‌ ఫోర్క్‌లు, మెరుగైన భద్రతకు డ్యూయల్‌ చానల్‌ ఏబీఎస్‌ను అమర్చారు. ఇన్ఫినిటీ డిస్‌ప్లే కొత్త పల్సర్లలో ప్రత్యేకం. డిస్‌ప్లే కన్సోల్‌లో ఇప్పుడు గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌ కూడా ఉంది. ఎన్‌ఎస్‌ 200 మోడల్‌ 18.75 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఎన్‌ఎస్‌ 160 మోడల్‌ 14.6 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్  పల్సర్ ఎన్‌ఎస్‌ 160, ఎన్‌ఎస్‌ 200లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్ , ప్యూటర్ గ్రే రంగులలో  లభ్యం.

Advertisement
 
Advertisement
Advertisement