 
													సాక్షి,ముంబై: సౌత్‌కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీఎస్22 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీఆఫర్ అందిస్తోంది. 33 శాతం తగ్గింపుతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది.
గెలాక్సీ ఎస్22 5జీ అసలు ధర రూ.85,999గ ఉండగా, తాజా ఆఫర్‌లో అమెజాన్‌లో కేవలం రూ.57,998 కి కొనుగోలు చేయవచ్చు. రూ.28వేల తగ్గింపుతోపాటు, ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది లాంచ్ చేసిన ఎస్ 22 సిరీస్‌లో ఇదే ఎఫర్డ్‌బుల్ ప్రైస్ డివైస్‌గా పేరొందింది.
గెలాక్సీ ఎస్ 22 5జీ  ఫీచర్లు 
6.1 అంగుళాల డైనమిక్ AMOLED డిస్‌ప్లే 
1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్  120 Hz రిఫ్రెష్ రేట్
Qualcomm Snapdragon 8 Gen 1 octa-core ప్రాసెసర్
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
50+12+10  ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 
10 ఎంపీ  ఫ్రంట్ కెమెరా
3700 mAh బ్యాటరీ
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
