breaking news
traditional game
-
మన మట్టిలో పుట్టిన ఆట.. ఊగిపోతున్న స్పెయిన్!
కర్రా బిల్లా (గిల్లి-దండ) ఆట పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తాతల కాలం నుంచే ఈ ఆట మనకు సుప్రసిద్ధం. భారతీయ చరిత్రలో పురాతన ఆటల్లో ఒకటిగా ఉన్న కర్రా బిల్లా ఇవాళ ఒక దేశంలో పాపులర్ ఆటగా మారిపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం. స్పెయిన్‌లో ఇప్పుడు మన కర్రా బిల్లా ఆట 'బిల్లార్డా' పేరుతో మోస్ట్ పాపులర్ గేమ్‌గా మారిపోయింది. ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉండే స్పెయిన్‌లో బిల్లార్డా (కర్రా బిల్లా) రూపంలో అక్కడి యువతకు ఇష్టమైన ఆటగా మారిందంటే అదంతా మన భారత్ చలువే అని చెప్పొచ్చు.కర్రా బిల్లా అంటే?భారత్‌లో తాతల కాలం నుంచే ప్రాచుర్యంలో ఉన్న కర్రా బిల్లా ఆటకు చాలా పేర్లే ఉన్నాయి. గోణి బిల్లా, గూటి బిల్లా, బిల్లా కర్ర, చిల్లంగోడు, కోడింబిల్లా, చిల్లగాల, బిల్లంగోడు పేర్లతో ప్రచారంలో ఉంది. సుమారు 4 అంగుళాలు ఉన్న కర్ర ముక్క, రెండు అడుగులు పొడవుగల కర్ర ఒకటి ఈ ఆటకు ఉపయోగిస్తారు. వీటిలో చిన్న దానిని ‘బిల్లా' అని, పెద్దదాన్ని ‘కర్ర’ అని పిలుస్తారు. అందుకే ఈ ఆటకు ‘కర్ర బిల్లా' అని పేరు వచ్చింది. నేలమీద చిన్న ‘కంచా‘ (గుంట) తవ్వి ఈ కంచా మీద ‘బిల్ల‘ను ఉంచి కర్రతో కొట్టే ప్రయత్నం చేస్తారు. దీనిని ‘గూటుట‘ అని పిలుస్తారు. సాధారణంగా ఈ ఆటను ఇద్దరు లేక నలుగురు ఏకకాలంలో ఆడవచ్చు. ఇక తాజాగా స్పెయిన్‌లో బిల్లార్డా గేమ్ ఆడుతున్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు ఈ గేమ్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెడితే మనమంతా ఒక జట్టుగా ఏర్పడి భారత్‌కు పతకాలు తేవొచ్చు అని కామెంట్లు పట్టడం ఆసక్తి కలిగించింది. Olympics lo pedithe manam kooda podama oka team form chesukoni 😂🏃🏃@LiberatedManasu @nagakishore981 @cartick94 @chanti185627865 @atheisttindiann @ThisIsRagh @crea__ture2 @wasteyavvaralu pic.twitter.com/3dMsXrW8Ev— Bhiku Mhatrey (@BhikuMhatrey) July 9, 2026 -
ప్రో కబడ్డీ లీగ్: ఇక ఐదో సీజన్ పండగే
ముంబై: భారత దేశ సంప్రదాయక గ్రామీణ క్రీడ కబడ్డీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. గ్రామలకే పరిమితమైన ఈ ఆట ప్రో కబడ్డీ లీగ్ పేరుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గత నాలుగు సీజన్లతో ప్రో కబడ్డీ లీగ్ కబడ్డీ అభిమానులను అలరించింది. ఈ ఎడాది జులైలో ఐదో సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ లీగ్‌లో 8 జట్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో నాలుగు జట్లు కొత్తగా చేరుతున్నాయి. ఈ విషయాన్ని పీకేఎల్ అధికారులు బుధవారం మీడియాకు తెలిపారు. కొత్తగా తమిళనాడు, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలనుంచి నాలుగు జట్లు ఐదో సీజన్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే ఉన్న జట్లు బెంగళూరు, హైదరాబాద్, పుణే, ఢిల్లీ, కొల్‌కత, జైపూర్, పట్నా నగరాల పేర్లతో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రోకబడ్డీ లీగ్‌లో కొత్తగా నాలుగు జట్లు చేరడంతో ఐదో సీజన్లో ఎక్కువ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మరో 11 రాష్ట్రాలకు ఈ లీగ్ విస్తరించనుందని, సుమారు 130 పైగా మ్యాచ్‌లు జరుగుతాయని లీగ్ అధికారులు పేర్కొన్నారు. కబడ్డీలీగ్‌ను మరింత విస్తరించాలని వాటాదారులంతా నిర్ణయించుకున్నట్లు స్టార్ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ తెలిపారు. సంప్రదాయ క్రీడలను ఆధునిక లీగ్‌ల పేర్లతో ఆదరణ కల్పించవచ్చనేదానికి ప్రో కబడ్డీ లీగ్ ఒక మంచి ఉదాహారణ అని అంతార్జాతీయ కబడ్డీ సంఘం అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గెహ్లాట్ అభిప్రాయపడ్డాడు.


