breaking news
gilli danda game
-
పునర్జన్మ పొందిన 'గిల్లీ దండ'.. ఇప్పుడు లీగ్‌గా..!
స్పెయిన్‌లోని గలీషియా గ్రామాలు, పట్టణాల్లో శతాబ్దాల నాటి ప్రాచీణ ఆట మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. బిల్లార్డా (గిల్లీ దండ) అనే ఈ ఆట ఇప్పుడు 'లీగా గలేగా డి బిల్లార్డా' అనే లీగ్ రూపంలో అక్కడి ప్రజల ముందుకు రానుంది. ఈ ఆట సాంప్రదాయ వారసత్వాన్ని ఆధునిక క్రీడాస్ఫూర్తితో కలిపి ముందుకు తీసుకెళ్తోంది. బిల్లార్డా అంటే ఏమిటి..?ఈ ఆటలో రెండు కర్రలు ఉపయోగిస్తారు. చిన్న కర్ర (బిల్లార్డా) నేలపై ఉంచుతారు. పెద్ద కర్రతో దానిని కొట్టి గాల్లోకి ఎగరేస్తారు. లక్ష్యం.. బిల్లార్డాను దూరంగా కొట్టి, దశలవారీగా గోల్ లైన్ దాటించడం. ఈ ఆటను భారత దేశంలో గిల్లీ దండ అని పిలుస్తారు. ఈ ఆటలో నైపుణ్యం, ఖచ్చితత్వం, వ్యూహం అవసరం. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ పోటీలు ఉత్సాహభరితంగా, సామూహికంగా సాగుతాయి. సంప్రదాయ ఆటలు 21వ శతాబ్దంలో కూడా ఎలా నిలదొక్కుకుంటాయో బిల్లార్డా చూపిస్తోంది. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, గ్రామీణ గుర్తింపును తిరిగి పొందే ఉద్యమని ఔత్సాహికులు అంటున్నారు. 'లీగా గలేగా డి బిల్లార్డా' ఇప్పుడు పోటీ లీగ్‌గా మారి, జానపద క్రీడలు కూడా కాలానుగుణంగా మార్పులు స్వీకరించి కొత్త తరాలను ప్రేరేపించగలవని నిరూపిస్తోంది. -
ప్రాణం తీసిన బెట్టింగ్ గిల్లీ దండ!
కోరుట్ల: బెట్టింగ్ గిల్లీ దండ ఓ పసివాడి ప్రాణం తీసింది. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన వెంటనే కాలనీలో గొడవ జరగగా అదే ఏరియాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని పంచాయితీ చేసి, బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 5న కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట ఏరియాలో ఓ ప్రజాప్రతినిధితో సహా 10 మంది రెండు గ్రూపులుగా మారి సుమారు రూ.20 వేలు బెట్టింగ్తో గిల్లీ దండ ఆడారు. ఆ సమయంలో అదే ఏరియాలో ఆడుకుంటున్న బాజి ఈశ్వర్(8) కణతకు గిల్లీ గట్టిగా తగిలింది. ఆ పసివాడు అస్వస్థతకు గురవగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మరుసటి రోజే అతను చనిపోయాడు. ఈశ్వర్ మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు గిల్లీతో కొట్టిన వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. ఆ వెంటనే గిల్లీదండ ఆడిన ప్రజాప్రతినిధితో పాటు అదే ఏరియాకు చెందిన మరో ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని పంచా యితీ పెట్టినట్లు తెలిసింది. బాధితులపై ఒత్తిడి చేసి, గిల్లీ దండ ఆడిన వారితో రూ.1.50 లక్షలు పరిహారం ఇప్పించినట్లు సమాచారం. మంచం కోడు తగిలి ఈశ్వర్ మృతి చెందినట్లు బాధిత కు టుంబీకులు చెప్పడంతో ఆ ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.


