భారత క్రికెట్ జట్టు టీ20ల్లో వరుస ఓటములతో సతమవుతున్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా పేలవ ఆట తీరు కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లను కోల్పోయింది.
ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్‌మెంట్‌పై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశ్నల వర్షం కురిపించాడు. భారత టీ20 జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఉన్నాడో తనకు ఆర్ధం కావడం లేదని జాఫర్ అన్నాడు. సుందర్ స్దానంలో మరొక ఆటగాడికి అవకాశమిస్తే బాగుంటుందని అతడు అభిప్రాయపడ్డాడు.
"వాషింగ్టన్ సుందర్‌ను ఏప్రాతిపదికన భారత టీ20 జట్టులో కొనసాగిస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. అతడి ఎంపిక నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. సుందర్ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటో కూడా తెలియడం లేదు. అతడిని ఫినిషర్‌గా ఆడించలేరు, అలాగని టాప్ ఆర్డర్‌లోనూ కూడా చోటు లేదు.
ఇది మొదటి సమస్య. ఇక రెండో విషయానికొస్తే.. అతడు నిలకడగా నాలుగు ఓవర్లు వేసే బౌలర్ కూడా కాదు. అలాంటప్పుడు అతడిని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారు? ఎవరికైనా తెలిస్తే నాకు కాస్త చెప్పండి. వరుణ్ చక్రవర్తి ఆడకపోతే అతడికి ప్రత్నామ్నాయంగా కుల్దీప్ యాదవ్ లేదా మరెవరినైనా పరిశీలించాలి.
శివాంగ్ కుమార్ రూపంలో భారత్‌కు మరో మంచి స్పిన్ ఆప్షన్ కూడా ఉంది. మిడిల్ ఓవర్లలో వికెట్లతో పాటు పరుగులు కట్టడి చేసే ఇద్దరు స్పిన్నర్లు భారత్‌కు అవసరం. కానీ ప్రస్తుతం భారత జట్టులో వరుణ్ రూపంలో ఒక్కడే మంచి స్పిన్నర్ కనిపిస్తున్నాడు" అని జాఫర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
వాస్తవానికి జాఫర్ ఒక్కడే కాదు చాలా మంది మాజీలు కూడా సుందర్ రోల్ ఎంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంగ్లండ్ టూర్‌లో తొలి మూడు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన సుందర్‌ను.. నాలుగో టీ20లో మాత్రం ఆడించారు. వరుణ్ చక్రవర్తి గాయం బారిన పడడంతో సుందర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కింది.
కానీ సుందర్ మాత్రం తన లభించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన సుందర్.. అనంతరం ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి 19 పరుగులు సమర్పించుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లను గమనిస్తే సుందర్ ఒకట్రెండు ఓవర్లు మినహా ఎక్కువ బౌలింగ్ చేయడం లేదు. పోనీ బ్యాటర్‌గా అయిన సక్సెస్ అవుతాన్నాడంటే అది కూడా లేదు. అలాంటప్పుడు అతడిని ఒక ఆల్‌రౌండర్‌గా ఎలా ఆడిస్తున్నారో మేనెజ్‌మెంట్‌కే తెలియాలి .


