టీమిండియాకు చుక్కలు చూపించాడు.. కట్‌ చేస్తే! భారీ రివార్డ్‌ | Jacob Bethell storms into top 10 T20I rankings | Sakshi
Sakshi News home page

Jacob Bethell: టీమిండియాకు చుక్కలు చూపించాడు.. కట్‌ చేస్తే! భారీ రివార్డ్‌

Jul 8 2026 4:08 PM | Updated on Jul 8 2026 4:27 PM

Jacob Bethell storms into top 10 T20I rankings

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా ప్ర‌క‌టించిన బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్ టూర్‌లో శ్రేయ‌స్ కెప్టెన్‌గా విఫ‌ల‌మైన‌ప్ప‌టికి బ్యాట‌ర్‌గా మాత్రం రాణించాడు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్య‌ర్‌.. 150.68 స్ట్రైక్ రేట్‌తో 110 ప‌రుగులు చేశాడు.

ఈ ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా శ్రేయ‌స్ బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 425 స్థానాలు ఎగబాకి 93వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇంగ్లండ్ యువ సంచ‌ల‌నం జాక‌బ్ బెథ‌ల్‌ తొలిసారి టాప్-10 లోకి దూసుకొచ్చాడు. బెథ‌ల్‌.. మార్ష్‌, బ్రెవిస్‌ వంటి స్టార్‌ క్రికెటర్లను వెనక్కి నెట్టి 8వ స్ధానానికి చేరుకున్నాడు. కాగా మాంచెస్టర్ టీ20లో బెథ‌ల్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. 191 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌ ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినా.. బెథెల్ మాత్రం 46 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. 

ఇందుకు ఫ‌లితంగా ర్యాంకింగ్స్‌లో బెథ‌ల్‌కు భారీ రివార్డు ల‌భించింది. తొలి రెండు స్ధానాల్లో భార‌త ఆట‌గాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కొన‌సాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఆదిల్ రషీద్, సామ్ కరన్ త‌మ స్ధానాల‌ను మెరుగుప‌రుచుకున్నారు. 

భారత్‌పై ఇప్పటివరకు 3 వికెట్లు పడగొట్టిన రషీద్, ఒక స్థానం ఎగ‌బాకి 3వ స్థానానికి చేరుకున్నాడు. సామ్ కరన్ బౌలింగ్ జాబితాలో 71 స్ధానం, ఆల్‌రౌండ‌ర్ల ర్యాంకింగ్స్‌లో 13వ స్ధానం సొంతం చేసుకున్నాడు. ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో భార‌త ఆట‌గాడు శివ‌మ్ దూబే టాప్‌-10 నుంచి బయ‌ట‌కు వెళ్లిపోయాడు.
చదవండి: IND vs ENG: సూర్యకుమార్‌ గుర్తొస్తున్నాడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement