టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం(జూలై 8) తన 54వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా గంగూలీకి సంబంధించి ఓ అద్భుతమైన వార్త బయటకు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 'హాల్ ఆఫ్ ఫేమ్'లో గంగూలీకి చోటు దక్కబోతున్నట్లు రెవ్‌స్పోర్ట్స్ గ్లోబల్ తమ కథనంలో పేర్కొంది.
అదేజరిగితే ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న 12వ భారత క్రికెటర్‌గా గంగూలీ నిలవనున్నాడు. ఈ జాబితాలో పురుషల విభాగం నుంచి.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, వినూ మన్కడ్. మహిళల విభాగం నుంచి డయానా ఎదుల్జీ, నీతూ డేవిడ్ మాత్రమే ఇందులో ఉన్నారు. కాగా ఐసీసీ హాల్ ఫేమ్‌ను 2009లో ప్రారంభించారు.
ఇక గంగూలీ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా దాదాపు 17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలను అందించాడు. 21వ శతాబ్దంలో తన దూకుడుతో టీమిండియా రూపు రేఖలను మార్చిన ఘనత అతడిది. 2003 వరల్డ్ కప్ ఫైనల్ చేరడం, 2004లో పాకిస్తాన్‌లో టెస్ట్ సిరీస్ గెలవడం, ఇగ్లండ్, ఆస్ట్రేలియా లలో సిరీస్‌లను డ్రా చేసుకోవడం గంగూలీ కెప్టెన్సీ లో హైలెట్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ'కోల్‌కతా ప్రిన్స్’ తన కెరీర్‌లో భారత్ తరఫున 311 వన్డేల్లో 11,363 రన్స్, 113 టెస్టుల్లో 7,212 రన్స్ సాధించారు. బీసీసీఐ ప్రెసెడింట్‌గా కూడా దాదా పనిచేశారు.
చదవండి: IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు


