మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

మహారాణిపేట: జిల్లాలో మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ ఎన్నికలకు సుమారు 11 వేల మంది సిబ్బందిని నియమించామని, ఈ నెల 30న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. పరిషత్‌ ఎన్నికలకు ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్‌ 5న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు తావులేకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సాధారణ పరిశీలకుడు భార్గవ్‌ తేజ్‌ కోరారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం 70955 99001 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. వ్యయ పరిశీలకుడు పి.వి. సందీప్‌ రెడ్డి 9440810041 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement