గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.అష్టమి ఉ.7.28 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ప.1.33 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: సా.5.55 నుండి 7.39 వరకు, దుర్ముహూర్తం: ప.12.08 నుండి 12.54 వరకు, తదుపరి ప.2.27 నుండి 3.14 వరకు, అమృత ఘడియలు: ఉ.6.44 నుండి 8.31 వరకు, మహర్నవమి, శుక్రమూఢమి ప్రారంభం.
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.34
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తిలాభం
వృషభం... బంధువుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యభంగం.
మిథునం... వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం
కర్కాటకం... ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. శుభవార్తలు. బంధువులతో సఖ్యత. విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.
సింహం... ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
కన్య... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు
తుల... కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు
వృశ్చికం... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
ధనుస్సు... కొన్ని ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకరం... ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు కలిసివస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. భూ, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కుంభం... కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం.
మీనం... ఉద్యోగయోగం. పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహన, గృహయోగాలు.


