ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 18-10-2026 To 24-10-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Oct 18 2026 1:43 AM | Updated on Oct 18 2026 1:43 AM

Weekly Horoscope Telugu 18-10-2026 To 24-10-2026

మేషం...
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు .దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయానికి లోటు ఉండదు. ఇంటాబయటా అనుకూలమైన వాతావరణం. మీ భావాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. వాహనాలు,భూములు కొంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి, అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవేత్తలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో  వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. శ్రీదక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృషభం....
కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ అనుకూలిస్తుంది. రాబడి అనూహ్యంగా పెరిగి అప్పులు తీరుస్తారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.  ఉద్యోగులకు  అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో  వివాదాలు. ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. తెలుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం...
శ్రమ çఫలించే సమయం. కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. అనుకున్న  కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాహ , ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక  ధనలాభ సూచనలు. కుటుంబసమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.  వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం మధ్యలో  శారీరక రుగ్మతలు. సోదరులతో కలహాలు. మనశ్శాంతి లోపిస్తుంది. నేరేడు, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి. 

కర్కాటకం...
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల ప్రత్యర్థులకు స్నేహహస్తం అందిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యూహాలు అమలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సోదరులు, సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది.  ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. పాతబాకీలు వసూలవుతాయి. అప్పులు తీరుస్తారు.  ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. కళాకారులు, వైద్యరంగం వారికి అనూహ్యమైన గౌరవం దక్కుతుంది. వారం చివరిలో  అనుకోని ఖర్చులు. ఆరోగ్యభంగం.  బంధువులతో వైరం. పసుపు, నేరేడు రంగులు. శ్రీలక్ష్మీస్తోత్రాలు పఠించండి.

సింహం...
ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకత సాధిస్తారు. చిన్ననాటì æస్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయం ఆశాజనకమే. కొన్ని బాకీలు వసూలవుతాయి. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామిక, కళారంగాలవారు అనుకున్న ప్రగతి సాధిస్తారు.  వారం చివరిలో  ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ,తెలుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.

కన్య...
కార్యక్రమాలలో  విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. భూ, వాహనయోగాలు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. డబ్బు కోసం ఇబ్బందులు తొలగుతాయి.  ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు సమస్యలు తీరి ఒడ్డునపడతారు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. శారీరకరుగ్మతలు. స్నేహితులతో తగాదాలు. పసుపు, ఆకుపచ్చరంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

తుల...
కొన్ని సమస్యలు తీరి ప్రశాంతత చేకూరుతుంది. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు.. కార్యజయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. అన్నింటా కుటుంబసభ్యులు సహకరిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా పొందుతారు. వారం మధ్యలో   ఆస్తి వివాదాలు. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.  

వృశ్చికం...
ఆదాయం ఆశించినంతగా లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. కాంట్రాక్టులు చేజారవచ్చు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి.  తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువులు, స్నేహితులతో విరోధాలు. తరచూ ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం.పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి.  వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి ఒప్పందాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. శ్రీనృసింహస్తోత్రాలు  పఠించండి. 

ధనుస్సు...
క్రమేపీ ఆదాయం మెరుగుపడుతుంది.  ఇంటాబయటా  అనుకూల పరిస్థితులు నెలకొని ముందుకు సాగుతారు. కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు కొత్త ఆశలుచిగురిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు రావచ్చు. వారం చివరిలో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. శ్రీ ఇంద్రాక్షిస్తుతి మంచిది.  

మకరం...
కొత్త  కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి సహాయం అందుతుంది. అదనపు ఆదాయం సమకూరి అప్పులు తీరతాయి. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి రాగలదు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులకు అనుకోని లాభాలు. పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు.  వారం ప్రారంభంలో అనారోగ్యం, ఔషధసేవనం. ఆకస్మిక ప్రయాణాలు. తెలుపు, నీలం రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం...
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులు, సోదరీలతో సఖ్యత నెలకొంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. దేవాలయ దర్శనాలు. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. వైద్యులు, పారిశ్రామికవేత్తలకు సంతోషకర సమాచారం. వారం చివరిలో  అనుకోని తగాదాలు. శారీరక రుగ్మతలు. ఖర్చులు. నేరేడు, నలుపు రంగులు. శివస్తుతి మంచిది.

మీనం...
కొత్త విషయాలు తెలుస్తాయి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. అందరిలోనూ పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. కుటుంబసమస్యల బయటపడతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గతానుభవాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అధికలాభాలు లభించే వీలుంది. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు.కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. పసుపు, గులాబీ రంగులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement