గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.చవితి రా.11.30 వరకు,
తదుపరి పంచమి, నక్షత్రం: అనూరాధ రా.3.35 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.10 వరకు, అమృత ఘడియలు: సా.4.16 నుండి, 5.55 వరకు.
సూర్యోదయం: 5.56
సూర్యాస్తమయం: 5.38
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం...
కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలు. శ్రమ తప్పదు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృషభం...
మీ నైపుణ్యాన్ని చాటుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి.
మిథునం...
కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కర్కాటకం...
పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం...
దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు. రుణాల వేటలో పడతారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కన్య...
నూతన వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. గతం గుర్తుకు వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
తుల...
మిత్రులతో మాటపట్టింపులు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం...
వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుతారు. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.
ధనుస్సు...
పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉండవచ్చు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నిదానిస్తాయి. దైవచింతన.
మకరం...
ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కుంభం...
నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.
మీనం...
పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. మీ ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.


