ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది | Rasi Phalalu: Daily Horoscope On 12-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది

Oct 12 2026 12:08 AM | Updated on Oct 12 2026 12:08 AM

Rasi Phalalu: Daily Horoscope On 12-10-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.విదియ రా.8.59 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: స్వాతి రా.11.51 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: తె.5.51 నుండి 7.33 వరకు(తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.56 వరకు, తదుపరి ప.2.30 నుండి 3.17 వరకు, అమృత ఘడియలు:  ప.2.36 నుండి 4.16 వరకు.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం     :  5.39
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

మేషం... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

వృషభం... నూతన వస్తు,వస్త్రలాభాలు. ఉద్యోగాలలో ఉన్నతి. వ్యాపారాలు లాభిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి.

మిథునం... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు.  వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం... ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం... పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కన్య... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం.

తుల... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. నూతన విద్య, ఉద్యోగయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఊహించని మార్పులు.

వృశ్చికం... ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు.

ధనుస్సు... కుటుంబసౌఖ్యం.  కాంట్రాక్టులు లభిస్తాయి. అంచనాలు నిజమవుతాయి. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం... చర్చలు సఫలం.  నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనకూలస్థితి.

కుంభం.... ఆర్థిక   పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. మానసిక అశాంతి.

మీనం... ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆలయాల సందర్శనం. ఆరోగ్యభంగం. ఉద్యోగమార్పులు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement