గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,భాద్రపద మాసం, తిథి: బ.చతుర్దశి రా.8.57 వరకు,తదుపరి అమావాస్య, నక్షత్రం: ఉత్తర రా.9.48 వరకు,తదుపరి హస్త, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు, తదుపరి ప.12.11 నుండి 12.58 వరకు, అమృత ఘడియలు: ప.2.40 నుండి 4.14 వరకు.
సూర్యోదయం : 5.55
సూర్యాస్తమయం : 5.42
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... చేపట్టిన పనులలో విజయం. విందువినోదాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.
వృషభం... వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.
మిథునం... బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో ఆటంకాలు.విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కర్కాటకం... పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. పనులు చకచకా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
సింహం... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు.ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల కలయిక. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
కన్య... నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. సంఘంలో ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
తుల... పనులలో తొందరపాటు వద్దు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
వృశ్చికం... విద్యార్థులకు కొత్త ఆశలు. కాంట్రాక్టులు దక్కుతాయి. యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
ధనుస్సు... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.
మకరం... ఆర్థిక లావాదేవీలు అంతగా కలిసిరావు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలలో అదనపు బాధ్యతలు. ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు.
కుంభం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మీనం... అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.


