గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.ఏకాదశి రా.2.04 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.3.35 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ప.12.55 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు, తదుపరి ప.12.07 నుండి 12.52 వరకు, అమృత ఘడియలు: రా.10.40 నుండి 12.18 వరకు, ప్రభోధనైకాదశి.
సూర్యోదయం : 6.11
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... కొన్ని కార్యాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదిస్తారు. శారీరక రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవకార్యాలలో పాల్గొంటారు.
వృషభం... పరపతి కలిగిన వారితో పరిచయాలు. సమాజంలో ప్రత్యేక ఆదరణ. ముఖ్య కార్యాలు చకచకా సాగుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితి.
మిథునం... శుభకార్యాల ప్రస్తావన. ధన,వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కర్కాటకం... ఆదాయానికి మించి ఖర్చులు. అప్పులు చేస్తారు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో అవాంతరాలు. వ్యాపార, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహం... ముఖ్య కార్యాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. బంధువులతో తగాదాలు. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
కన్య... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. అదనపు ఆదాయం. వస్తులాభాలు. స్నేహితులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనసౌఖ్యం.
తుల... దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. కార్యజయం. దైవదర్శనాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విద్యార్థులకు కొంత అనుకూలం.
వృశ్చికం... అనుకున్న కార్యక్రమాలు మందకొడిగా. సాగుతాయి. నిర్ణయాలలో తొందరవద్దు. శ్రమ ఫలించదు. శారీరక రుగ్మతలు. సోదరులతో స్వల్ప. వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి
ధనుస్సు... కష్టమే తప్ప ఫలితం ఉండదు. కొన్ని కార్యాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కొత్త బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
మకరం... ఇంట శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కుంభం... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం... పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తిలాభం. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. దైవారాధనలో పాల్గొంటారు.


