గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు,కార్తీక మాసం, తిథి: శు.నవమి రా.1.51 వరకు తదుపరి దశమి, నక్షత్రం: శతభిషం రా.2.14 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ఉ.8.28 నుండి 10.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.07 వరకు, అమృత ఘడియలు: సా.6.36 నుండి 8.17 వరకు
సూర్యోదయం : 6.10
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సన్మానయోగం. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
వృషభం... కొత్త విషయాలు తెలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విందువినోదాలు. సోదరులతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
మిథునం... పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
సింహం... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త వద్యావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కన్య... ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
తుల... ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. బంధువులతో వైరం. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం... ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. సన్నిహితుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.
ధనుస్సు... వ్యవహారాలలో విజయం. ఆప్తుల కలయిక. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం... రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.
కుంభం... ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
మీనం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.


