గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.పంచమి రా.7.54 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: పూర్వాషాఢ సా.6.14 వరకు తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.3.04 నుండి 4.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.08 నుండి 7.37 వరకు,అమృత ఘడియలు: ప.12.55 నుండి 2.40 వరకు.
సూర్యోదయం : 6.08
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
వృషభం... కుటుంబంలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు.
మిథునం... కొత్త పనులు చేపడతారు. ఇంటిలో శుభకార్యాలు. ధన, వస్తులాభాలు. సంఘంలో గౌరవం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత..
కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.
సింహం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమాధికం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.
కన్య... రుణయత్నాలు. పనులలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.
తుల... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృశ్చికం... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి..
ధనుస్సు... సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం... మిత్రులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. దైవదర్శనాలు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
కుంభం... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
మీనం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.


