గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.విదియ ప.1.48 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: అనూరాధ ఉ.10.44 వరకు, తదుపరి జ్యేష్ఠ,వర్జ్యం: సా.4.52 నుండి 6.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.21 నుండి 12.06 వరకు, అమృత ఘడియలు: రా.3.22 నుండి 5.11 వరకు, భగినీహస్త భోజనం.
సూర్యోదయం : 6.06
సూర్యాస్తమయం : 5.22
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృషభం... పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
మిథునం... చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పోటీపరీక్షల్లో విజయం. భూ, వాహనయోగం. చర్చలు సఫలం. దైవదర్శనాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు హోదాలు.
కర్కాటకం... రుణదాతల ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
సింహం... కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కన్య... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
తుల... పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
వృశ్చికం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. పదవీయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
ధనుస్సు... కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
మకరం... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
కుంభం... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలోకొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.
మీనం... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.


