గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.10.34 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: చిత్త ఉ.6.05 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ప.12.01 నుండి 1.41 వరకు, దుర్ముహూర్తం: సా.3.54 నుండి 4.37 వరకు, అమృత ఘడియలు: రా.9.50 నుండి 11.40 వరకు, దీపావళి, ధనలక్ష్మీ పూజలు.
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.25
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం... నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృషభం... పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
మిథునం... కొత్త రుణయత్నాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. పనుల్లో ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొంత నిరాశ.
కర్కాటకం... పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం... వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కన్య... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
తుల... సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.
వృశ్చికం... ఆశ్చర్యకరమైన సంఘటనలు. దైవదర్శనాలు. నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనుస్సు... పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. చర్చలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు ఆశాజనకం.
మకరం... పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కుంభం... చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగానే నడుస్తాయి. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.
మీనం... సేవా కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉండవచ్చు. పనులు వాయిదా. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.


