ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 03-11-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం

Nov 3 2026 4:18 AM | Updated on Nov 3 2026 4:26 AM

Rasi Phalalu: Daily Horoscope On 03-11-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.నవమి ప.2.54 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: ఆశ్లేష ఉ.7.39 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.7.05 నుండి 8.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.19 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.28 నుండి 11.19 వరకు, అమృత ఘడియలు: ఉ.6.08 నుండి 7.40 వరకు, తదుపరి తె.4.12 నుండి 5.44 వరకు (తెల్లవారితే బుధవారం)

సూర్యోదయం :    6.03
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు

మేషం... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.  దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం పరిస్థితి నెలకొంటుంది.

వృషభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. కొన్ని బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. అనుకున్న పనుల్లో మరింత పురోగతి. వస్తు, వస్త్రలాభాలు. దైవచింతన.

మిథునం... ఆర్థిక వ్యవహారాలలో అసంతృప్తి. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో విభేదాలు. కొన్ని పనులు నిదానంగా కొనసాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం... ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు అభివృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

సింహం... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. . వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడులు. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. ఒప్పందాలలో ఆటంకాలు..

కన్య... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి. ఉద్యోగయోగం.  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

తుల... కొత్త పనులు చేపడతారు. మిత్రుల నుంచి అనుకూల సమాచారం.  ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో మార్పులు సంభవం.

ధనుస్సు... సోదరులతో వివాదాలు. ధనవ్యయం. అనుకోని  ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడనక సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం... పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కొన్ని వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం... ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వాహనయోగం.

మీనం... శ్రమాధిక్యం. పనుల్లో  స్వల్ప ఆటంకాలు.  ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement